'అంతా రూల్స్ ప్రకారమే'.. మహిళ జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు
X
తనకున్న కొద్దిపాటి స్థలంలోనే ప్రభుత్వం... విద్యుత్ టవర్ ఏర్పాటు చేస్తుండటంతో నిరసన వ్యక్తం చేసింది ఓ మహిళ. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే తన భూమిని ఆక్రమించుకునేది లేదని తేల్చి చెప్పింది. అయినా అధికారులు తమ పని మానుకోకపోవడతో నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు ఆమె పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఆమె స్థలంలోనే ఆమెను జుట్టు పట్టి అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లా (Katni)లో జరిగిందీ సంఘటన.
కట్నీ జిల్లాలోని కౌరియాకు (Kauriya) చెందిన చైనా బాయ్ కచి (Chaina Bai Kachi) అనే మధ్య వయస్కురాలైన మహిళ స్థలంలో అధికారులు విద్యుత్ టవర్‌ను (Electricity tower) ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఆమెకు నష్ట పరిహారం ఇవ్వకుండానే టవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో తన బంధువులతో కలిసి పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెను జుట్టు పట్టి అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. దీనినంతటినీ అక్కడున్నవారు తమ ఫోన్లలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పంధించారు.టవర్ నిర్మాణ పనులు అడ్డుకోవడంతోనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని, చట్టప్రకారమే వ్యవహరించామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ కేడియా వెల్లడించారు. అది పాత వీడియో అని చెప్పారు.
लाड़ली बहना को बालों से घसीट कर अमानवीयता की हदें पार करती भैया शिवराज सिंह जी की पुलिस।
— MP Youth Congress (@IYCMadhya) August 16, 2023
बेहद शर्मनाक!
मामला मध्यप्रदेश के कटनी जिले का है। pic.twitter.com/syGAVYWimI
అయితే తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టారని బాధితురాలు వాపోయారు. కాంట్రాక్టర్లు, విద్యుత్ కంపెనీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.