Home > జాతీయం > మోదీ ఉమ్మడి పౌరస్మృతి వ్యాఖ్యలపై ఒవైసీ కౌంటర్...

మోదీ ఉమ్మడి పౌరస్మృతి వ్యాఖ్యలపై ఒవైసీ కౌంటర్...

మోదీ ఉమ్మడి పౌరస్మృతి వ్యాఖ్యలపై ఒవైసీ కౌంటర్...
X

భోపాల్‎లో ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి దమ్ముంటే పంజాబ్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని సవాల్ విసిరారు. యూనిఫాం సివిల్ కోడ్ గురించి పంజాబ్ వెళ్లి సిక్కులకు చెప్పాలన్నారు. హిందూ సివిల్ కోడ్ అమలు చేసేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే ముందు.. దేశంలో మధ్యపాన నిషేధం అమలు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. జాతీయ సమైక్యత , భిన్నత్వం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని.. ఉమ్మడి పౌరస్మతి పేరుతో వాటికి విఘాతం కల్పించాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

మోదీ ఏమన్నాంటే ?

భోపాల్‎ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ముస్లింలను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ఆలోచిస్తారని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే ...

ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాలలో ఎందుకు పాటించడం లేదని మోదీ ప్రశ్నించారు. ఒక కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు ఉండటం కుదరదు.. ఒక దేశం రెండు చట్టాలపై నడవదు అని ప్రధాని స్పష్టం చేశారు.


Updated : 27 Jun 2023 5:38 PM IST
Tags:    
Next Story
Share it
Top