నేలకేసి కొట్టిన ముఖ్యమంత్రి..
X
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కోపం వచ్చింది. బార్మర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం మైక్ సరిగా పనిచేయకపోవడంతో వేదికపైనే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన ముఖ్యమంత్రి మైకును నేలకేసి కొట్టారు. ఈ దృశ్యాలను కాస్త ఆ కార్యక్రమానికి వచ్చిన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో దుమారం రేపుతోంది. సీఎం, జిల్లా కలెక్టర్ పైకి మైకు విసిరారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి గెహ్లాట్ బార్మర్ సర్క్యూట్ హౌస్‌లో శుక్రవారం సాయంత్రం ఓ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు హాజరయ్యారు. పథకాల అమలు తీరును మహిళలను అడిగి తెలుసుకునేందకు ప్రయత్నించగా సీఎంకు మైకు ఇరిటేషన్ తెప్పించింది. మాట్లాడే మైకు పనిచేయకపోవడంతో సీరియస్ అయిన గెహ్లాట్ ఆ మైకును తన ఎడమ చేతివైపు నేలకేసి కొట్టారు. అక్కడే జిల్లా కలెక్టర్ నిలుచున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆ మైకును తీసుకోగా , ముందున్న ఓ మహిళ ఇంకో మైక్‌ను గెహ్లాట్‌కు ఇచ్చారు అయితే సోషల్ మీడియాలో మాత్రం గెహ్లాట్ కలెక్టర్ పైకి మైకు విసిరారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ప్రచారాన్ని ఖండించింది. మైక్‌ను జిల్లా కలెక్టర్‌పైకి సీఎం విసరలేదని స్పష్టం చేసింది.