లోక్సభ ఎలక్షన్స్ వరకే.. తర్వాత రాహుల్ గాంధీని కచ్చితంగా అరెస్ట్ చేస్తాం: Assam CM
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలో రాజకీయంగా ఉద్రిక్తతతలకు దారితీస్తుంది. ఇవి కాదన్నట్లు ఇటీవల రాహుల్.. ‘నాపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టుకోండి. కేసులు నన్నేం ఆపలేవు. బెదిరించలేవ’ని అస్సాం సీఎం హిమంత బిస్వశర్మకు కౌంటర్ ఇచ్చారు. ఈ వాఖ్యలపై స్పందించిన అస్సాం సీఎం.. ‘లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని కచ్చితంగా అరెస్ట్ చేసి తీరతామ’ని చెప్పుకొచ్చారు. ఒకవేళ రాహుల్ పై ఇప్పుడ చర్యలు తీసుకుంటే.. దాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా ప్రచారం చేసుకుంటారని అన్నారు.
కాగా అస్సాంలో రాహుల్ చేస్తున్న జోడో పాదయాత్ర సందర్భంగా.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో హిమంత బిశ్వశర్మ చేసిన వాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వివాదాన్ని ప్రారంభించడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమని ఆయన విమర్శించారు. అస్సాంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేదే రాహుల్ గాంధీ యాత్ర ఉద్దేశమని ఆయన ఆరోపణలు చేశారు.