ఎట్టకేలకు సీఎం హేమంత్ సొరేన్ ఆచూకీ లభ్యం..
X
భూకుంభకోణం మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు ఆచూకి లభ్యమయింది. తాను మిస్సింగ్ అంటూ వస్తున్న ప్రచారంపై సీఎం సొరేన్ స్పందించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా ఆయన నివాలర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కనిపించకుండా ఎక్కడికి వెళ్లారని మీడియా ప్రశ్నించగా నేను మీ హృదయాల్లో ఉన్నాను అని బదులిచ్చారు. మనీలాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.ఈ నేపథ్యంలో సోరెన్ తప్పించుకొని తిరుగుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ రోజంతా ఎదురుచూసినా సొరేన్ జాడ కనిపించకపోవడంతో ఈడీ అధికారులు వెనుదిరిగారు. సొరేన్ కి సంబంధించిన కారు, 36 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. అయితే కనిపించకుండా పోయిన సొరేన్ 18 గంటల తరువాత రాంచీలో ప్రత్యక్షమయ్యాడు. తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన జనవరి 31న ఈడీ విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు అంటున్నారు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, కపిల్‌సిబాల్‌తో ఆయన సంప్రదింపులు జరిపారు. కాగా, ఈ ఘటన అంతా హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు జరిగిన కుట్ర అని సీఎం సోరెన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు