Home > జాతీయం > భారత్లో.. చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మ దహనం

భారత్లో.. చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మ దహనం

భారత్లో.. చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మ దహనం
X

అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు చైనా వైఖరిపై రగిలిపోతున్నారు. ఏషియన్ గేమ్స్ 2023లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి హాజరు కావాల్సిన అథ్లెట్ల విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లు నైమన్ వాంగ్సు, ఒనిలు తేగ, మెపంగ్ లమ్గ్ లను చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో పాల్గొనకుండా చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం వివాదానికి దారి తీసింది. ఈ ముగ్గిరి విసాలను చైనా నిరాకరించింది. అంతేకాకుండా మిగతా అథ్లెట్లకు అక్రిడేషన్ ఇచ్చి.. ఈ ముగ్గురిని పక్కబెట్టింది. దీంతో చైనా తీరును నిరసిస్తూ ఈ అథ్లెట్లు తేజ్ పట్టణంలో నిరసనకు దిగారు. విద్యార్థులు, ఏబీవీపీ, ల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్, స్థానిక విద్యార్థి సంఘాల మద్దతుతో.. పట్టణంలో సంయుక్తంగా పెద్ద ర్యాలీ నిర్వహించారు.

దాదాపు 300 పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తేజ్ లోని క్లాక్ టవర్ నుంచి గాంధీ చౌక్ వరకు వీరి ర్యాలీ సాగింది. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మను నిరసన కారులు తగలబెట్టారు. ఈ ముగ్గురు అథ్లెట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వీరికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల ప్రోత్సాహకాన్ని అంధించింది. గత కొంత కాలంగా అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమదేనని చైనా పేర్కొంటూ వస్తుంది. ఆ కారణంతో చైనా అథ్లెట్లపై ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.




Updated : 28 Sep 2023 9:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top