Peddakottapalli ATM : ఓర్నీ.. ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు.. ఎక్కడంటే..?
X
దొంగతనానికి కాదేదీ అనర్హం. మంచి వంటకాలను చూస్తే నోరూరినట్లు.. లక్షల డబ్బులుండే ఏటీఎం అంటే దొంగలకు చెయ్యి ఊరుతుంది. ఏటీఎంని ధ్వంసం చేసి డబ్బులు తీసుకెళ్లడం అప్పుడప్పుడు వింటాం. కానీ ఓ చోట దొంగలు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో శనివారం రాత్రి భారీ వర్షం పడింది. దీంతో అర్ధరాత్రి వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇదే టైం అనుకున్న దుండగులు బస్టాండ్ చౌరస్తా సమీపంలోని ఇండియా వన్ కంపెనీ ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశారు. ముందుగా సీసీ కెమెరాల వైర్ను కత్తిరించి, రాడ్డుతో షట్టరును పైకి లేపి ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లారు.
ఆదివారం షెట్టర్ ఓపెన్ చేద్దామని వెళ్లగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించినట్లు నిర్వాహకుడు తెలిపారు. వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏటీఎంలోదాదాపు 5 నుంచి 6 లక్షలు ఉంటాయని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.