Ayodhya Ram Mandir : ఈ న్యాయవాది వల్లే అయోధ్య సాకారం..
X
కోట్లాది భారతీయుల ఈ కలను సాధ్యం చేయటంలో న్యాయవాది కేశవ్ పరాశరన్‌ది కీలక పాత్ర. సుదీర్ఘంగా సాగిన అయోధ్య కేసుకు పరాశరన్ ఎన్నో వాదనాలు చేశారు. వివాద స్థలం ముమ్మూటికీ శ్రీరాముడిదే అంటూ ఆయన చేసిన వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. భారత న్యాయ వ్యవస్థలో కేశవానంద భారతి కేసు తర్వాత అయోధ్య రామమందిరంపైనే చాలా కాలం విచారణ జరిగింది. తమిళనాడు చెందిన సీనియర్ లాయర్ కేశవ్ పరాశరన్ సుప్రీంకోర్టులో 40 రోజుల 4 గంటలకుపైగా నిలబడి ఉండేవారు. రాముడిపై విపరీతమైన భక్తి ఉన్న ఆయన అది ఎప్పటికీ ఆలయమే అంటూ 500 ఏళ్ల హిందువుల కలను సాకారం చేశారు.
కేసును గెలిపించారు. తెలుగురాష్ట్రాలకు చెందిన లాయర్లు.అయోధ్య భూవివాదం కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టగానే 2017లో ఈ కేసులో పిటిషనర్ల తరపున న్యాయవాదులు, హిందూ సంఘాలు ఒక టీమ్‌గా ఏర్పాడ్డారు. ఇక్కడే తమవంతు సాయంగా తెలుగు లాయర్లు కూడా కృషి చేశారు. ఈ కేసులో పనిచేసిన తెలుగు లాయర్లలో తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ శ్రీధర్ పోతరాజు, అఖిల భారతీయ అధివక్త పరిషత్‌లు కేసులో ఎంతో కీలకంగా మారిన సమాచారాన్ని అందించాయి. ఇక వీరిచ్చిన సమాచారంపై దివ్వెల భరత్ కుమార్, వాడ్రేవు పట్టాభిరామ్, తాడిమళ్ల భాస్కర గౌతమ్, గవర్రాజు ఉషశ్రీ , వీఎన్ఎల్ సింధూరలు రీసెర్చ్ చేశారు. కీలక సమాచారాన్ని సేకరించారు.