Home > జాతీయం > Ram mandir : హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇలా వెళ్లండి..

Ram mandir : హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇలా వెళ్లండి..

Ram mandir : హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇలా వెళ్లండి..
X

కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న శుభ ముహూర్తం దగ్గరవుతోంది. జనవరి 22న రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రామయ్య దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ క్రమంలో చాలా మంది భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా రామ మందిరానికి వెళ్లే అవకాశముంది. సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఎయిర్ లైన్స్ సైతం స్పెషల్ ఫ్లైట్స్ను నడిపేందుకు సిద్ధమయ్యాయి.

రోడ్డు మార్గం

హైదరాబాద్ నుంచి అయోధ్య మధ్య దూరం 1305 కిలోమీటర్లు. రోడ్డు మార్గం ద్వారా వెళ్తే దాదాపు 40 గంటల సమయం పడుతుంది. ప్రైవేటు వాహనాలు, ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. నాగ్ పూర్, జబల్ పూర్, ప్రయాగ్ రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టికెట్ ధర రూ.6వేల నుంచి మొదలవుతుంది.

రైలు మార్గం

అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు దాదాపు 30 గంటలపైగా ప్రయాణ సమయం ఉంటుంది. తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి సికింద్రాబాద్ - గోరఖ్ పూర్ ట్రైన్ అందుబాటులో ఉంది. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు మార్గంలో అయోధ్యకు చేరుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ - గోరఖ్పూర్‌ రైలు ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి బీదర్ అయోధ్య బై వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి ఆది, సోమవారాలలో అందుబాటులో ఉంది. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే ప్రతి సోమ, శుక్ర, ఆదివారాల్లో రైలు అందుబాటులో ఉంది.

విమాన మార్గం

విమానం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులకు హైదరాబాద్‌ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి అయోధ్యకు నేరుగా ఫ్లైట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. శంషాబాద్ నుంచి ఢిల్లీ, గోరఖ్ పూర్, లక్నో ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి 140 కిలోమీటర్లు బస్సు లేదా రైలులో ప్రయాణించి అయోధ్యకు చేరుకోవచ్చు.

Updated : 22 Jan 2024 1:49 PM IST
Tags:    
Next Story
Share it
Top