Home > జాతీయం > 700పైగా శవపరీక్షలు చేసిన మహిళకు అయోధ్య ఆహ్వానం

700పైగా శవపరీక్షలు చేసిన మహిళకు అయోధ్య ఆహ్వానం

700పైగా శవపరీక్షలు చేసిన మహిళకు అయోధ్య ఆహ్వానం
X

జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకకోసం అంతా ఎదురుచూస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానం అందించారు. ఈ నేపథ్యంలో 700 పైగా పోస్ట్ మార్టంలలో సాయపడిన శవపరీక్షలు చేసే మహిళా సహాయకురాలికి కూడా ఆహ్వానం అందింది. 35 ఏళ్ల సంతోషి దుర్గను జనవరి 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. సంతోషి దుర్గ నర్హర్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపుగా 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ సమయంలో, సంతోషి 700 పోస్ట్‌మార్టమ్‌లను నిర్వహించడం విశేషం. అందుకు చేసిన కృషికి వివిధ సంఘాల నుండి గుర్తింపు పొందారు.

ఈ నేపథ్యంలో మాట్లాడిన సంతోషి తన సంతోషాన్ని పంచుకున్నారు. తనకు రామమందిర ఆహ్వానం పంపినందుకు అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. తనకు ఆహ్వానం అందుతుందని ఎప్పుడూ అనుకోలేదని, ఆహ్వాన పత్రిక మొదట అందుకోగానే కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. తనలాంటి వారిని కూడా గుర్తించి ఆహ్వానం పంపడం ఆనందంగా ఉందని అన్నారు.




Updated : 14 Jan 2024 9:27 PM IST
Tags:    
Next Story
Share it
Top