Home > జాతీయం > Ayodhya : అయోధ్యలో కేఎఫ్సీ.. కానీ షరతులు వర్తిస్తాయి..

Ayodhya : అయోధ్యలో కేఎఫ్సీ.. కానీ షరతులు వర్తిస్తాయి..

Ayodhya  : అయోధ్యలో కేఎఫ్సీ.. కానీ షరతులు వర్తిస్తాయి..
X

అయోధ్యలో బాలక్ రామ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్షలాది మంది బాల రామున్ని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య రామ మందిర పరిసరాల్లో యాత్రికులకు అవసరమైన వస్తువులు, ఆహారం అందించే స్టాళ్లు వెలుస్తున్నాయి. . అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లు తమ ఔట్‌లెట్‌లను అయోధ్యలో ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రైడ్ చికెన్ ఐటెమ్స్కు పేరున్న కేఎఫ్సీ అయోధ్యలో తమ ఔట్ లెట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

అయోధ్య - లక్నో హైవేపై కేఎఫ్సీ ఏర్పాటుకు అనుతించిన జిల్లా యంత్రాంగం ఒకవేళ ఆ సంస్థ కోరితే రామ మందిరానికి సమీపంలో స్టాల్ ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇస్తామని చెప్పింది. అయితే అందులో కేవలం శాఖాహార పదార్థాలు మాత్రమే విక్రయించాలని కండీషన్ పెట్టింది. ఆలయానికి కిలోమీటరు దూరంలో ఇప్పటికే డొమినోస్ పిజ్జా ఔట్ లెట్ తెరిచారు. ప్రస్తుతం అది కస్టమర్లతో కళకళలాడుతోంది.

డొమినోస్ పిజ్జా ఔట్ లెట్ నడుపుతున్న దినేష్ యాదవ్ తాను స్టాల్ ఓపెన్ చేసిన మొదటి రోజునే దాదాపు రూ.5వేల వ్యాపారం చేశానని చెప్పారు. నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో యాత్రికుల సంఖ్య పెరిగి గిరాకీ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి అయోధ్య ఆలయ పరిసరాల్లోని పంచ కోసి మార్గ్‌లో మాంసం, మద్యం విక్రయాలను నిషేధించారు. పంచ కోసి పరిక్రమ అనేది అయోధ్య చుట్టూ ఉన్న 15 కి.మీ తీర్థ యాత్ర సర్క్యూట్. ఈ క్రమంలో ఆ 15 కిలోమేటర్ల మేర హోటళ్లు, ఫుడ్ కోర్డుల్లో నాన్ వెజ్ మెనూ కనిపించదు.




Updated : 7 Feb 2024 7:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top