Ayodhya Ram : అయోధ్య రాముని పేరును మార్చిన ఆలయ ట్రస్ట్.. ఇకపై అలానే పిలవాలట
X
అయోధ్య రామమందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హిందువుల దశాబ్దాల కల నెరవేరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక జరిగింది. బాల రాముడిని చూసి భక్త జనం పులకించిపోయింది. ప్రారంభోత్సవం రోజున కేవలం వీఐపీలకు అనుమతి ఉండగా.. సాధారణ పౌరులకు ఇవాళ్టినుంచి (జనవరి 23) రామ్ లల్లా దర్శనానికి అనుమతిస్తున్నారు. కాగా ఆలయంలో ఉన్న రామున్ని ఇప్పటివరకు రామ్ లల్లాగా పిలుస్తున్నారు. అయితే ఇకపై రామ్ లల్లాను బాలక్ రామ్ గా పిలవనున్నారు.
ఈ విషయాన్ని అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ప్రాణప్రతిష్ట జరిగిన శ్రీరాముడి విగ్రహానికి బాలక్ రామ్ గా పేరు పెట్టామని చెప్పారు. గర్భగుడిలో ప్రతిష్టించిన రాముడి విగ్రహం ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ గా పేరు పెట్టినట్లు చెప్పారు. అంతేకాకుండా ఇకపై ఆయోధ్య రామమందిరాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలవనున్నట్లు చెప్పారు.