Home > జాతీయం > Konaseema Coconut: అయోధ్య రాములోరికి కోనసీమ నుంచి కానుక

Konaseema Coconut: అయోధ్య రాములోరికి కోనసీమ నుంచి కానుక

Konaseema Coconut: అయోధ్య రాములోరికి కోనసీమ నుంచి కానుక
X

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కోట్లాది మంది భారత ప్రజలు ఆ కోదండ రాముని దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ట్రస్ట్ సభ్యులు. ఈ నేపథ్యంలో రామయ్యకు దేశ నలుమూలల నుంచి ప్రత్యేక కానుకలు అందుతున్నాయి. కొన్ని ప్రత్యేక వస్తువురు కార్యక్రమంలో భాగం అవుతున్నాయి. ఇప్పుడు ఏపీ కోనసీమ కొబ్బరి బోండాలకు ఆ అవకాశం దక్కింది. కోనసీమ జిల్లా మండపేట నుంచి ఈనెల 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కొబ్బరి బోండాలను తరలించనున్నారు.

మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు ఈ కొబ్బరి బోండాలు పంపుతున్నారు. అయోధ్యలోని సీతమ్మ ఆశ్రమం కోరిక మేరకు శంకు చక్రనామ కొబ్బరి బోండాలను భక్తిశ్రద్ధలతో తయారుచేసి రాముడికి కానుకగా పంపుతున్నారు. ఈ బోండాలను అయోధ్యలో రాముల వారి విగ్రహప్రాణ ప్రతిష్ట రోజున వినియోగించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో తాము కూడా భాగం అవడం తమ పూర్వ జన్మ సుకృతం అని రామారెడ్డి దంపతులు చెప్తున్నారు.




Updated : 17 Jan 2024 7:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top