సమతా ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..లోకోపైలెట్ కాపాడాడు..
X
తృటిలో మరో రైలు ప్రమాదం తప్పింది. నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమతా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఇంజిన్ విడిపోయిన విషయాన్ని గ్రహించిన లోకోపైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం టౌన్ స్టేషన్ నుంచి పార్వతీపురం స్టేషన్‌కు వచ్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరిగి ఇంజిన్‌ను వెనుక్కు తీసుకెళ్లి బోగీలకు అమర్చడంతో గంటన్నర తర్వాత రైలు కదలింది. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు తరచూ సంభవించడంతో ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. 290 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా బాలేశ్వర్ లో మరో రైలు ప్రమాదం తర్వాత దేశంలో ఏదో ఒక ప్రమాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి బొమ్మాయి పల్లి మధ్య ఫలక్ నుమా రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆరు బోగీలు దగ్థమయ్యాయి. సకాలంలో ప్రయాణికులను బోగీల నుంచి దింపేయడంతో పెను ప్రమాదమే తప్పింది.