Home > జాతీయం > టీడీపీ-బీజేపీ పొత్తు ఊహగానాలే : బండి సంజయ్

టీడీపీ-బీజేపీ పొత్తు ఊహగానాలే : బండి సంజయ్

టీడీపీ-బీజేపీ పొత్తు ఊహగానాలే : బండి సంజయ్
X

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. టీడీపీ-బీజేపీ పొత్తు ఊహగానాలేనని కొట్టి పడేశారు. బీజేపీ పార్టీ ప్రజలు, ప్రతిపక్ష నేతలను కలస్తోందని..ఆ నేపథ్యంలో చంద్రబాబు కలిశారని వివరించారు. గతంలో మమత, స్టాలిన్‌, నితీశ్‌ కూడా మోదీ, అమిత్‌షాను కలిశారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలను, ప్రజలను కలవకుండా కేసీఆర్ మాత్రమే ఉంటారని, ఆయనలా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ తమది కాదన్నారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని బండి సంజయ్ చెప్పారు. బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

బీజేపీ పెద్దలను శనివారం రాత్రి చంద్రబాబు కలిశారు. ఢిల్లీలోని అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. పొత్తులపై మాట్లాడేందుకు చంద్రబాబును పిలిచారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణతో పాటు, ఏపీలో కలిసి పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

Updated : 4 Jun 2023 4:39 PM IST
Tags:    
Next Story
Share it
Top