Home > జాతీయం > అధ్యక్ష మార్పు ఊహాగానాలే ...ఇదంతా బీఆర్ఎస్ కుట్ర : బండి సంజయ్

అధ్యక్ష మార్పు ఊహాగానాలే ...ఇదంతా బీఆర్ఎస్ కుట్ర : బండి సంజయ్

అధ్యక్ష మార్పు ఊహాగానాలే ...ఇదంతా బీఆర్ఎస్ కుట్ర : బండి సంజయ్
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్ష మార్పు ఊహాగానాలే అని...ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అన్నారు. కేసీఆర్ కావాలనే లీకులు చేయిస్తున్నారని ఆరోపించారు. అధ్యక్ష మార్పుపై నడ్డా చెప్పిందే ఫైనల్ అని వివరించారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం కేసీఆర్‎కు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్రపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈటల భద్రతపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. హత్యకు సుపారి ఇచ్చినవారిని అరెస్ట్ చేయాలన్నారు. హత్య చేస్తానన్న వ్యక్తి బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టడంపై బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నాపై దాడులు జరిగాయి. రాజాసింగ్ పై దాడులు జరిగాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అందరికీ భద్రత కల్పించాల్సిందే” అని బండి సంజయ్ డిమాండ్ వ్యక్తం చేశారు.

Updated : 28 Jun 2023 7:45 PM IST
Tags:    
Next Story
Share it
Top