టిఫిన్ రేట్లు పెరుగుతున్నై.. ఇడ్లీ, దోసె మరింత కాస్ట్లీ..!
X
సామాన్యుడు.. బయట ఏం కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ తో పాటు.. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హోటల్స్ అసోసియేషన్ ఓ పెద్ద బాంబు పేల్చింది. రెస్టారెంట్స్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ తో పాటు, బయట దొరికే టిఫిన్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ధరలు ఇకపై పెంచేందుకు నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ వార్త వినగానే కామన్ మ్యాన్ భయబ్రాంతులు గురయ్యాడు.
పెరిగిని నిత్యావసర ధరలు, కూరగాయల రేట్ల కారణంగా ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెంచుతున్నట్లు బెంగళూరులోని.. బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం రెస్టారెంట్స్ కే కాకుంగా బయట అమ్మే.. టిఫిన్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కు వర్తిస్తుందని తెలిపింది. దాదాపు 10 నుంచి 15 శాతం ధరలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై జులై 25న నిర్వహించబోయే అసోసియేషన్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.