Home > జాతీయం > Shakib Al Hasan:భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన బంగ్లా స్టార్ క్రికెటర్

Shakib Al Hasan:భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన బంగ్లా స్టార్ క్రికెటర్

Shakib Al Hasan:భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన బంగ్లా స్టార్ క్రికెటర్
X

బంగ్లాదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఘనవిజయం సాధించారు. మగురా పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన 150,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 36 ఏళ్ల షకీబ్.. అవామీ లీగ్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగారు. కొద్ది రోజులే ప్రచారం చేసినా భారీ మోజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం కోసం క్రికెట్‌కు కొద్ది రోజులు షకీబ్ దూరంగా ఉన్నాడు. షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు.

ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు టోర్నీలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను గెలవడంతో అతను క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చట్టసభ సభ్యునిగా, క్రికెట్ కెప్టెన్‌గా తన విధులను మేనేజ్ చేయలేడనే విమర్శలను షకీబ్ తిప్పికొట్టాడు. నేను క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. మీకు ఎందుకు ఆ ఆలోచన వస్తుంది అని ఫైర్ అయ్యాడు. షకీబ్ ప్రస్తుతం.. వన్డే, టెస్ట్, టీ20 మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ ర్యాంక్ పొందిన ఏకైక వ్యక్తి షకీబ్ నిలిచాడు.

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీకి మెజారిటీ లభించింది. 300 స్థానాలకు గానూ ఆ పార్టీ ఏకంగా 200 సీట్లను గెలుచుకుంది. దీంతో షేక్‌ హసీనా ఐదోసారి ప్రధాని పీఠం అధిరోహించనున్నారు. గోపాల్‌గంజ్‌-3 నుంచి బరిలోకి దిగిన షేక్‌ హసీనా .. 2,49,965 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్‌ లష్కర్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1986 నుంచి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నషేక్‌ హసీనా వరుసగా ఎనిమిదో సారి గెలిచారు. ఇక ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష‌మైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) సహా దాని మిత్రపక్షాలు బహిష్కరించాయి.

Updated : 8 Jan 2024 8:56 AM IST
Tags:    
Next Story
Share it
Top