Bank of Baroda: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేయొచ్చు
X
ఇటీవల కాలంలో ప్రతి చోటా డిజిటల్ ట్రాన్సక్షన్స్ పెరిగిపోయాయి. పెద్ద పెద్ధ షాపింగ్ మాల్స్‌తో పాటు కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు కూడా యూపీఐ పేమంట్స్‌కకే ఆసక్తి చూపుతున్నారు. క్రెడిట్ , డెబిట్ కార్డుల వాడకం ఒక్క ఏటీఎం సెంటర్లలో తప్ప మిగతా చోట్ల పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలో కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of baroda) తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్‌ఆపరేటబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయిల్(ICCW)ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఆయా ఏటీఎం కేంద్రాల్లో డెబిట్ కార్డు లేకుండానే... యూపీఐను ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
UPI ద్వారా క్యాష్ విత్ డ్రా సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి ప్రభుత్వరంగ బ్యాంక్ తమదేనని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం ఈ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఏటీఎం కేంద్రాల్లో తొలుత ‘cash Withdraw’ సదుపాయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కనిపించే QR code ను మొబైల్ నుంచి ఏదైనా యూపీఐ యాప్ (Googke pay, Phone pay) ద్వారా స్కాన్ చేసి క్యాష్ మొత్తం, పిన్ ఎంటర్ చేయడంతో ట్రాన్సక్షన్ పూర్తి చేయొచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ. 5,000కాగా, రోజుకు 2 ట్రాన్సక్షన్స్ దీనితో జరుపుకోవచ్చు.
ఒకవేళ యూపీఐ ఐడీతో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్‌లు లింక్ అయి ఉంటే ఏ బ్యాంక్ నుంచి అమౌంట్ కట్ అవ్వాలనేది కస్టమర్ ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 11వేల బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రాల్లో ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని అన్ని బ్యాంకులూ తీసుకురావాలని గతంలో ఆర్‌బీఐ ఆదేశించింది.