Wage Hike: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో..!
X
బ్యాంక్ ఉద్యోగులు త్వరలో గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. జీతం పెంపుతో పాటు.. ఎంతో కాలంగా డిమాండ్ లో ఉన్న వారానికి ఐదు రోజుల పని విధానాన్ని తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్) ఉద్యోగులకు 15 శాతం జీతం పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 15 శాతం కంటే ఎక్కువగా జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
కొవిడ్ టైంలోనూ అవిశ్రాంతంగా సేవలందించి, ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు ఇటీవల కాలంలో బ్యాంకుల లాభాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రతిపాదనపై.. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ ఆమోదం చేయాల్సింది ఉంది. ఇప్పటి ఎల్ఐసీలో 5 రోజుల పని విధానం అమల్లో ఉంది. ప్రస్తుతం బ్యాంకుల్లో రెండో, నాలుగో శనివారం సెలవుగా ఉంది. ఒకవేళ కొత్త డిమాండ్ కు అమోదం లభిస్తే.. బ్యాంకులు కేవలం వారంలో ఐదు రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి.