Home > జాతీయం > టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన పనిలేదు.. త్వరలోనే కొత్త సిస్టం

టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన పనిలేదు.. త్వరలోనే కొత్త సిస్టం

టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన పనిలేదు.. త్వరలోనే కొత్త సిస్టం
X

ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద చాలావరకు రద్దీ తగ్గింది. పండగల సమయంలో మాత్రం ఈ రద్దీ ఎక్కువే ఉంటుంది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజా రద్దీని నివారించేందుకు మరో కొత్త విధానాన్ని తీసుకరానుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద అసలు రద్దీ అనేదే లేకుండా చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మరో ఆరు నెలలో ఇది అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.





ఈ కొత్త సిస్టం అందుబాటులో వస్తే టోల్ ప్లాజాల వద్ద 30 సెకన్లు కూడా ఆగాల్సిన అవసరం ఉండదని కేంద్రమంత్రి వీకే సింగ్ చెప్పారు. కెమెరాలు, ఉపగ్రహాలు వంటి సాంకేతికత ఆధారంగా ఈ నూతన టోల్ సిస్టమ్ పనిచేస్తుందని.. ప్రస్తుతం ఢిల్లీ - మీరఠ్ ఎక్స్‌ప్రెస్ వే లో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త విధానంలో ప్రతి టోల్‌ప్లాజాలో ఉండే నిర్ణీత రుసుము ఉండదు. జాతీయ. రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ చెల్లించేలా రూపకల్పన చేస్తున్నారు.

‘‘టోల్ గేట్ వద్ద మీ వెహికిల్ నంబర్ను కెమెరా స్కాన్ చేసి డేటా క్రోడీకరిస్తుంది. అప్పుడు మీరు ప్రయాణించిన కిలోమీటర్లకు ఛార్జీలు పడతాయ్. టెలికాం సహా అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఈ పురోగతి సాధ్యపడుతోంది.'' అని మంత్రి తెలిపారు. గతంలో నితిన్ గడ్కరీ కూడా టోల్ ఫీజు వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను 6 నెలల్లో తీసుకొస్తామని చెప్పారు.


Updated : 3 Aug 2023 8:52 AM IST
Tags:    
Next Story
Share it
Top