Home > జాతీయం > చనిపోయాడనుకుంటే 4 నెలల తర్వాత మోమోస్‌ తింటూ కనిపించాడు..

చనిపోయాడనుకుంటే 4 నెలల తర్వాత మోమోస్‌ తింటూ కనిపించాడు..

చనిపోయాడనుకుంటే 4 నెలల తర్వాత మోమోస్‌ తింటూ కనిపించాడు..
X

ఆ వ్యక్తిని అందరూ చనిపోయాడనుకున్నారు. దగ్గర బంధువులే తమ కుమారుడిని కిడ్నాప్ చేశారని అతని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇదంతా 4 నెలల క్రితం బిహార్‌లో జరిగింది. ఇంతలోనే కిడ్నాప్‌‎కు గురై చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి అనూహ్యంగా ఢిల్లీలోని నోయిడాలో ప్రత్యక్షమయ్యాడు. ఎవరైతే కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికే మోమోస్ తింటూ కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.

బిహార్‌లోని భాగ‌ల్పూర్‌‌కు చెందిన నిషాంత్ కుమార్ . 2023 జ‌న‌వ‌రి 31నుంచి కనిపించకుండా పోయాడు. అతడిని బావ‌మ‌రింది ర‌వి శంక‌ర్ సింగ్‌, మామ న‌వీన్ సింగ్ కిడ్నాప్ చేశారంటూ నిషాంత్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఎప్పటికీ నిశాంత్ ఆచూకీ దొరక్కపోవడంతో చనిపోయాడని అంతా భావించారు. అయితే నోయిడాలోని ఓ మోమోస్ షాపులో ర‌వి శంక‌ర్ సింగ్‌ ఉండగా..అక్కడ నిషాంత్ కుమార్ మోమోస్ తింటూ కనిపించాడు. అత‌డిని పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్ల‌గా వారు బిహార్ పోలీసుల‌కు అప్ప‌గించారు. నిషాంత్‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచారు. కిడ్నాప్ కు గురైన నిశాంత్ ఢిల్లీ ఎలా చేరాడని పోలీసులు విచారిస్తున్నారు. దీని వెనుక ఉన్న కుట్రను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.

Updated : 14 Jun 2023 3:01 PM IST
Tags:    
Next Story
Share it
Top