West Bengal CM Mamata Banerjee: ఎమ్మెల్యేల జీతాలు పెరిగినయ్.. ఎంత పెరిగిందంటే..?
X
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి జీతాలను 40వేల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనిపై శాసనసభలో ఆమె ప్రత్యేక ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల జీతాలు తక్కువగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే తన జీతంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. సీఎంగా మమతా ఎలాంటి జీతం తీసుకోవడం లేదు.
ఈ పెంపుతో ఎమ్మెల్యేల జీతాలు 10వేల నుంచి 50వేలకు పెరగనున్నాయి. మంత్రుల జీతాలు రూ.10,900 నుంచి రూ.50,900లకు.. కేబినెట్ మంత్రుల జీతాలు రూ.11 వేల నుంచి రూ.51 వేలకు పెరుగుతాయి. అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కలుపుకొంటే ఎమ్మెల్యేలకు రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు చొప్పున వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు డీఏ చెల్లింపులు చేయాలంటూ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ చేస్తున్న వేళ మమతా తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
bengal cm,cm mamata Banerjee,mla salary,mla salaries,west bengal,west bengal mla,kolkata