Home > జాతీయం > బెంగాల్ సీఎం మమత కాన్వాయ్లో ప్రమాదం.. దీదీకి స్వల్ప గాయం..

బెంగాల్ సీఎం మమత కాన్వాయ్లో ప్రమాదం.. దీదీకి స్వల్ప గాయం..

బెంగాల్ సీఎం మమత కాన్వాయ్లో ప్రమాదం.. దీదీకి స్వల్ప గాయం..
X

బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బర్వ్దాన్లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. కోల్కతాకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మమతకు స్వల్ప గాయాలయ్యాయి. పొగమంచు ఎక్కువగా ఉండి ముందున్న వాహనాలు కనిపించకపోవడమే యాక్సిడెంట్ కు కారణమని సమాచారం. సీఎం మమతా బెనర్జీ కూర్చున్న వెహికిల్ కాన్వాయ్‌లో ముందున్న వాహనానికి అతి సమీపంలోకి వెళ్లడంతో డ్రైవర్‌ సడెన్‌గా బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న దీదీ నుదురుతో పాటు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. వాతావరణం అనుకూలించనికారణంగా మమత బెనర్జీ రోడ్డు మార్గం ద్వారా కోల్కతాకు బయలుదేరారు. ఈ క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది. గతేడాది జూన్‌లోనూ సిలిగురిలోని సెవోక్‌ ఎయిర్‌బేస్‌లో హెలీకాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఆ సమయంలో దీదీ ఎడమకాలికి గాయమైంది.

Updated : 24 Jan 2024 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top