Home > జాతీయం > Bengaluru IndiGo : ఇండిగో విమాన సిబ్బంది చీప్ ట్రిక్.. ప్రయాణికులకు చేదు అనుభవం

Bengaluru IndiGo : ఇండిగో విమాన సిబ్బంది చీప్ ట్రిక్.. ప్రయాణికులకు చేదు అనుభవం

Bengaluru IndiGo : ఇండిగో విమాన సిబ్బంది చీప్ ట్రిక్.. ప్రయాణికులకు చేదు అనుభవం
X

ఇండిగో(Indigo) విమాన సిబ్బంది.. బస్తీ, గల్లీలలో ఉండే షేర్ ఆటోవాలాల్లా ప్రవర్తించారు. ఇద్దరి, ముగ్గురికైతే ఆటో కదలదు.. మరో ఆటో చూసుకోమని ఏ విధంగా చెబుతారో.. కాస్త అటు ఇటుగా అలాగే ప్రవర్తించారు ఇండిగో సిబ్బంది. ఎంతైనా ఎయిర్ బస్ కదా.. అదే రేంజ్‌లో కొంచెం డీసెంట్ టచ్‌తో విమానం ఎక్కిన ప్రయాణికులను ఫూల్స్ చేశారు. ఆరుగురి ప్రయాణికులతో విమానం నడిపేందుకు ఇష్టపడని సిబ్బంది.. వారికి మరో విమానం ఉందని చెప్పి.. ఉన్న విమానంలో నుంచి అర్థాంతరంగా దింపేశారు. అసలు విషయం తెలుసుకున్న ఆ ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమృత్‌సర్‌ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో విమానం 6E478.. చెన్నై చేరుకోవడానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. అక్కడ ప్రయాణికులంతా దిగిపోయాక.. కేవలం ఆరుగురు ప్రయాణికులు మాత్రమే మిగిలారు. వారంతా చెన్నైకి వెళ్లాల్సినవారు. అయితే తక్కువ మంది ప్రయాణికులతో విమానాన్ని నడిపేందుకు ఇష్టపడని ఇండిగో గ్రౌండ్‌ సిబ్బంది వారిని మరో ప్రత్నామ్నాయ విమానం ఉందని.. నా బోర్డింగ్‌ పాస్‌ కూడా సిద్ధంగా ఉందంటూ తెలివిగా దింపేశారు. తర్వాత మరో విమానాన్ని ఏర్పాటు చేయకపోవడంతో మోసపోయామని ఆ ప్రయాణికులు గ్రహించారు. కేవలం ఆరుగురితో విమానం నడపడం ఇష్టం లేకే ఈ విధంగా చేశారని ఆరోపించారు.

మరోవైపు ఆ రాత్రి ఇండిగో సంస్థ తమకు ఎలాంటి వసతి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి స్పందిస్తూ.. "మరుసటి రోజు ఉదయం వారిని మరో విమానంలో చెన్నైకి పంపించాం ’ అని పేర్కొన్నారు.




Updated : 21 Nov 2023 7:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top