Home > జాతీయం > Rameshwaram Cafe : బెంగుళూరు రామేశ్వరం కేఫ్ ఆదాయం ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

Rameshwaram Cafe : బెంగుళూరు రామేశ్వరం కేఫ్ ఆదాయం ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

Rameshwaram Cafe : బెంగుళూరు రామేశ్వరం కేఫ్ ఆదాయం ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
X

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్​లో జరిగిన పేలుడు.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం కేఫ్‌లో పెట్టిన బాంబు పేలడంతో 10 మంది గాయాలపాలయ్యారు. ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. బాంబు ఉన్న బ్యాగ్‌ను నిందితుడు కేఫ్‌లో వదిలివెళ్లినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించినట్టు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అతడి వయసు 28- 30 ఏళ్లు ఉండొచ్చని అన్నారు. రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్‌లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్‌ను అక్కడ వదిలేసి వెల్లిపోయాడని చెప్పారు. ఇక ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి సృష్టించిన ఈ బాంబు పేలుడుతో.. అసలు అక్కడే ఎందుకు బాంబును వదిలిపెట్టారనే ప్రశ్న తలెత్తుతుంది. రామేశ్వరం కేఫ్ ఆ ప్రాంతంలోనే అత్యంత ఫేమస్ అయినది.. దీనికి రోజుకు వేల మంది కస్టమర్లు వచ్చి వెళుతుంటా.. ఈ కేఫ్ అన్ని ఖర్చులు పోను నెలకు 4.5 కోట్ల ఆదాయం వస్తుందని కేఫ్ ఓనర్ రాఘవేంద్రరావు చెబుతున్నారు. కాగా ఈ రామేశ్వరం కేఫ్ లో అత్యధికంగా ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, బటర్ ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీని అత్యధికంగా ఇష్టపడి తింటుంటారు. అయితే ఈ బాంబు పేలుడులో ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో ప్రభుత్వం, పోలీసులు విచారణ చేస్తుండగా.. హోటల్ బిజినెస్‌లో రామేశ్వరం కేఫ్ ఉన్న గుడ్‌విల్ ను దెబ్బతియడానికే ఇలా చేసి ఉంటారని కర్ణాటక లోకల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

ఈ ఘటనపై రామేశ్వరం కేఫ్ ఓనర్లు రాఘవేంద్రరావు, దివ్య రాఘవేంద్రరావు స్పందించారు. ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చానని, రామేశ్వరం కేఫ్‌ను కూడా తమ బిడ్డ లాగే చూసుకుంటామని దివ్య రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. తన బిడ్డకు, రామేశ్వరం కేఫ్‌కు ఎలాంటి తేడా లేదన్న ఆమె.. రామేశ్వరం కేఫ్‌కు జరిగిన నష్టం తమను చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా రామేశ్వర కేఫ్ కస్టమర్లకు ఆమె హామీ ఇచ్చారు. అతి తొందర్లోనే రామేశ్వరం కేఫ్ బలంగా తిరిగి వస్తుందని పేర్కొన్నారు. అప్పుడు రామేశ్వరం కేఫ్ మరింత పటిష్ఠమైన భద్రత, ఇతర సెక్యూరిటీ సిస్టమ్‌లతో పనిచేస్తుందని దివ్య రాఘవేంద్ర రావు స్పష్టం చేశారు.

Updated : 2 March 2024 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top