Home > జాతీయం > 'ఆంటీ.. కొంచెం పక్కకు జరుగుతారా..?'.. చెప్పుతో మహిళ దాడి

'ఆంటీ.. కొంచెం పక్కకు జరుగుతారా..?'.. చెప్పుతో మహిళ దాడి

ఆంటీ.. కొంచెం పక్కకు జరుగుతారా..?.. చెప్పుతో మహిళ దాడి
X

ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడే కాదు.. వారిని పిలిచేటప్పుడు కూడా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అపరిచిత మహిళలను పొర‌పాటున ఆంటీ అని పిలిచారంటే ఇక మీ పని అంతే. ఆ తర్వాత వారి చూపించే విశ్వరూపానికి.. మీ ఒళ్లు హూనమయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు కర్ణాటకలోని బెంగుళూరు నగరంలో జ‌రిగిన ఘ‌ట‌నే నిలువెత్తు నిద‌ర్శనం. ఈ నెల 19 న బెంగళూరు సిటీలో ఓ మహిళ.. మనీ విత్ డ్రా చేసేందుకు దగ్గరలోని ATM సెంటర్ కు వెళ్లింది. నగదు తీసుకొని తిరిగి బయటికి వెళ్లి క్రమంలో డోర్ వద్ద ఆగింది. లోపలకు వచ్చే వాళ్లకు అడ్డుగా ఉంటారనుకొని.. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు.. 'ఆంటీ.. కొంచెం పక్కకు జరుగుతారా..?' అంటూ సంబోధించాడు.

అంతే.. ఆ మాటతో సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కాలికున్న చెప్పును తీసుకుని.. సెక్యూరిటీ గార్డుపై విరుచుకుపడింది. అతడిపై శారీరకంగా దాడి చేయడమే కాకుండా తీవ్ర పదజాలంతో కూడా దూషించింది. ఆ ATM వద్ద ఉన్న ఇతర కస్టమర్లు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. సదరు మహిళ అశ్వినిగా , ఆమె చేతిలో దెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు కృష్ణయ్య గా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌లో కృష్ణయ్య జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయగా, ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే అదృష్టవశాత్తూ, దాడి జరిగినప్పటికీ, సెక్యూరిటీ గార్డుకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. మరోవైపు, మహిళను అదుపులోకి తీసుకున్నప్పటికీ బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలిసింది.

Updated : 25 Sept 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top