Home > జాతీయం > China Battery: చైనా బ్యాటరీ అని తీసిపారేయకండి.. ఇది ఛార్జింగ్ లేకుండా పనిచేస్తుంది.

China Battery: చైనా బ్యాటరీ అని తీసిపారేయకండి.. ఇది ఛార్జింగ్ లేకుండా పనిచేస్తుంది.

China Battery: చైనా బ్యాటరీ అని తీసిపారేయకండి.. ఇది ఛార్జింగ్ లేకుండా పనిచేస్తుంది.
X

ఈ డిజిటల్ యుగంలో ప్రతీ ఎలక్ట్రానికి డివైస్ కు బ్యాటరీ అవసరం తప్పనిసరి. ఇదివరకటిలా కాకుండా.. ఫాస్ట్ గా చార్జ్ అయ్యేందుకు ఫాస్ట్ చార్జర్లు, ఎక్కువ శక్తిని విడుదల చేసే బ్యాటరీలు తయారుచేసేందుకు కంపెనీలు శ్రమిస్తున్నాయి. ఎంత హైఎండ్ టెక్నాలజీ వచ్చినా.. ప్రతీసారి బ్యాటరీకి చార్జింగ్ పెట్టాలంటే కాస్త ఇబ్బందే. ఇలాంటి టైంలో చార్జింగ్ పెట్టే అవసరం లేని బ్యాటరీలు వస్తే ఎంత బాగుండు.. అని ఎంతమందికి అనిపించి ఉంటుంది. మనలాగే ఈ కంపెనీకి కూడా అనిపించిందేమో.. చార్జింగ్ పెట్టే అవసరంలేని బ్యాటరీ తయారుచేస్తుంది చైనాకు చెందిన బీటావోల్డ్ అనే స్టార్టప్ కంపెనీ. దీనికి సంబంధించిన వివరాలు ఇటీవలే ఆ కంపెనీ తెలిపింది.

బీజింగ్ కు చెందిన బీటావోల్ట్ అనే న్యూక్లియర్ బ్యాటరీని అభివృద్ధి చేస్తుంది. BV100 పేరుతో పిలిచే ఈ బ్యాటరీ సైజ్.. రూపాయి బిల్లకన్నా చిన్నగా ఉంటుందట. నికెల్‌-63 ఐసోటోప్‌, డైమండ్‌ సెమీకండక్టర్‌లతో దీన్ని తయారుచేస్తున్నారు. 3 వోల్ట్స్ వద్ద ఇది 100 మైక్రోవాట్స్ పవర్ ను విడుదల చేస్తుంది. ఈ టెక్నాలజీతో వస్తున్న అతిచిన్న బ్యాటరీ ప్రపంచంలో ఇదే మొదటిదని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ బ్యాటరీ.. 2025 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. ఏరోస్పేస్‌, ఏఐ పరికరాలు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోలలోనూ ఈ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చట.




Updated : 16 Jan 2024 10:45 AM IST
Tags:    
Next Story
Share it
Top