Home > జాతీయం > CITU : ఆ రోజున భారత్ బంద్‌కు సీఐటీయూ పిలుపు

CITU : ఆ రోజున భారత్ బంద్‌కు సీఐటీయూ పిలుపు

CITU : ఆ రోజున భారత్ బంద్‌కు సీఐటీయూ పిలుపు
X

కేంద్ర కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ మేరకు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు. ఈ బంచ్‌లో సంయుక్త కిసాన్ మోర్చా సహా 90 కార్మిక సంఘాలు పాల్గొంటాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కార్మికులు దాదాపు20 కోట్లకు పైగా అధికారిక అనధికారిక కార్మికులు పాల్గొంటారని ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్‌కి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి .బ్యాంకులే కాకుండా ఉక్కు, చమురు, టెలికాం, బొగ్గు, తపాలా, ఆదాయపు పన్ను, రాగి, బీమా వంటి వివిధ రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు.

రైల్వే, రక్షణ రంగంలోని యూనియన్లు అనేక వందల ప్రదేశాలలో సమ్మెకు మద్దతుగా భారీ సమీకరణ చేయాలని భావిస్తున్నారు. రోడ్డు, రవాణా, విద్యుత్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. రైతులకు సమగ్ర రుణమాఫీ చేయాలని, కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రాథమిక హక్కుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని కోరారు. రైల్వే రక్షణ విద్యుత్తు తో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణఆపాలని, ఉద్యోగాల్లో కాంట్రాక్ట్రీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటిత, ఆ సంఘటిత ఆర్థిక వ్యవస్థలు అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని,సామాజిక భద్రత కల్పించాలని కోరారు .కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 104 రద్దు చేయాలని దీని వల్ల ఆటో మరియు వాహన డ్రైవర్లకు అందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

Updated : 5 Feb 2024 9:55 AM IST
Tags:    
Next Story
Share it
Top