Home > జాతీయం > దేవ్బంద్లో చంద్రశేఖర్ ఆజాద్పై కాల్పులు

దేవ్బంద్లో చంద్రశేఖర్ ఆజాద్పై కాల్పులు

దేవ్బంద్లో చంద్రశేఖర్ ఆజాద్పై కాల్పులు
X

భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుధవారం (జూన్ 28) ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లా దేవ్‌బంద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ పై ఈ దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తులు హర్యానా లైసెన్స్ ప్లేట్ ఉన్న కారులో సంఘటనా స్థలానికి చేరుకుని.. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న ఆజాద్ పై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఆయనకు బులెట్ గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు.. చంద్రశేఖర్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Updated : 28 Jun 2023 6:56 PM IST
Tags:    
Next Story
Share it
Top