Home > జాతీయం > Bihar MLAs : హైదరాబాద్‌కు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Bihar MLAs : హైదరాబాద్‌కు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Bihar MLAs : హైదరాబాద్‌కు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
X

క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. బిహార్‌కు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భాగ్యనగరహానికి తరలించింది. తాజాగా బీజేపీ మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.ఆయన ఈ నెల 12 అసెంబ్లీలో బలం నిరూపించుకోనున్నారు. దీంతో బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు ఝర్ఖండ్‌కు చెందిన జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 3 రోజులు పాటు హైదరాబాద్‌‌లో ఉండి ఇవాళే తిరిగి వెళ్లిపోయారు. తాజాగా బీహార్‌కు చెందిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో క్యాంప్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా బీహార్ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, స్టేట్ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డిలు బీహార్ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని సమన్వయం చేస్తున్నారు.

కాగా, బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాఘట్ బంధన్‌ కూటమి నుండి వైదొలగడంతో బీహార్ పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇండియా కూటమికి టాటా చెప్పిన నితీష్ కుమార్ ఎన్డీఏ గూటికి చేరారు. బీజేపీతో కలిసి నితీష్ కుమార్ బీహార్‌లో మరోసారి సర్కారున్ని ఏర్పాటు చేశారు. బీహార్‌కు 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్‌ ప్రభుత్వన్నికి ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బలపరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాకుండా కాంగ్రెస్ తమ పార్టీ నేతలను హైదరాబాద్‌కు తరలించింది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మెజారిటీతో నడుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 60 అయితే 64 మంది మాత్రమే కాంగ్రెస్ కి ఉన్నారు. సీపీఐ మద్దతు కలుపుకుని 65 మంది ఉన్నారు ఇది సింపుల్ మెజారిటీ కింద లెక్క. విపక్షం చూస్తే 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి ఉన్నారు.

బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు. మజ్లీస్ కి ఏడుగురు ఉన్నారు. అంటే యాభై నాలుగు మంది అన్న మాట. మరో ఆరుగురు కలిస్తే ప్రభుత్వం కూలుతుంది.మరో వైపు చూస్తే కేసీఆర్ రాజకీయ చాణక్యుడు ఆయన ఎన్నికలు జరిగిన రెండు నెలల తరువాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. నిజానికి అయితే ఆయన అసెంబ్లీకి రారని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ తాను ఎమ్మెల్యేగానే ఉంటా అంటూ ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి.స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతరని అన్నా సంగతి తెలిసిందే. ఎన్నాళ్ళు ఉంటుందో ప్రభుత్వం అన్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ దానికి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లు కూడా చర్చకు వస్తున్నాయి. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలా మాట్లాడే బీఆర్ఎస్ నేతలను గ్రామాల్లోకి రానీయవద్దు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇస్తున్నారు.

Updated : 4 Feb 2024 2:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top