కడుపు చేస్తే రూ.13 లక్షలు.. టెంప్ట్ అయితే..
X
సైబర్ నేరస్థుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్లు, లోన్లు, స్కీంలు, ఓటీపీ స్కాంల పేరుతో జనం నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే బీహార్కు చెందిన ఓ గ్యాంగ్ మాత్రం సరికొత్త మార్గం ఎంచుకుంది. మగవారికి గాలం వేసేందుకు.. ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ పేరుతో రాకెట్‌కు తెర లేపింది. మగాళ్లు ఎవరైనా మహిళలను ప్రెగ్నెంట్ చేస్తే వారికి భారీ మొత్తం ఇస్తామని ప్రచారం చేసింది. వారి మాటలు నమ్మి కొన్ని వందల మంది మోసపోయారు. చివరకు పాపం పండటంతో గ్యాంగ్ సభ్యుల్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
ముఠా సభ్యులు వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా మగవారిని సంప్రదిస్తారు. మహిళలకు సుఖం అందించడంతో పాటు వారిని ప్రెగ్నెంట్ చేస్తే.. రూ.13 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తారు. ఆసక్తి కలవారు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని, అందుకోసం రూ.799 ఫీజుగా చెల్లించాలని చెబుతారు. పేర్లు నమోదు చేసుకున్న తర్వాత వారిని నమ్మించేందుకు కొందరు అమ్మాయిల ఫోటోలను వాట్సాప్ చేస్తారు. అందులో నుంచి ఒక అమ్మాయిని ఎంచుకొమ్మని చెబుతారు. వారి అందం ఆధారంగా రూ.5 వేల నుంచి రూ. 20 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేయమని అడుగుతారు. ఆ మొత్తాన్ని జమ చేశాక పత్తా లేకుండా పోతారు. ఇలా ఎంతోమంది మగాళ్లు ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయి డబ్బులు పోగొట్టుకున్నారు.
ఇటీవలి కాలంలో కంప్లైంట్లు పెరిగిపోవడంతో బీహార్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా 8 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.