హిందూ పండుగలకు సెలవులు రద్దు.. బీహార్ సంచలన నిర్ణయం
X
బీహార్ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన 2024 సెలవు జాబితా వివాదాస్పదంగా మారింది. ఈ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ఈద్-బక్రీద్‌కు మూడు రోజులు, ముహర్రం కోసం రెండు రోజుల చొప్పున సెలవులు కేటాయించారు. అంతేకాకుండా మేడే, గాంధీ జయంతి రోజల్లో ఉన్న సెలవులను రద్దు చేసి.. గురుగోవింద్ సింగ్ జయంతి, రవిదాస్ జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు.
"तुष्टिकरण के सरदार-बिहार के कुर्सी कुमार"
— Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) November 27, 2023
एकबार फिर चाचा-भतीजे की सरकार का हिंदू विरोधी चेहरा सामने आया। एक तरफ स्कूलों में मुस्लिम पर्व की छुट्टी बढ़ाई जा रही हैं,वहीं हिंदु त्योहारों में छुट्टियां खत्म की जा रही हैं।
लानत है वोटबैंक के लिए सनातन से घृणा करने वाली सरकार को। pic.twitter.com/3yX6WAeGnx
ఉపాధ్యాయులకు వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. ఉపాధ్యాయులకు ఉన్న 60 రోజుల సెలవుల్లో 38 రోజులు పాఠశాలకు రావాల్సి ఉంటుందని, ఏడాదిలో 22 రోజులు మాత్రమే సెలవు ఉంటుందని తెలిపింది. విద్యార్థులకు యథావిధిగా వేసవి సెలవులు ఉంటాయి. ప్రత్యేక రోజులలోనూ పాఠశాలలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులలో భోజన వేళకు ముందు ఆ ప్రత్యేకదినానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు తెలియజేయాల్సివుంటుంది. హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా క్యాలెండర్‌పై నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నితీష్ కుమార్ పరిపాలన ఉందంటూ బీజేపీ నేత సుశీల్ మోడీ ఆరోపించారు. ముస్లిం పండుగలకు సెలవులు ఇచ్చి.. హిందూ పండుగలకు సెలవులను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజలే ఈ నేతలకు తగిన సమాధానం చెబుతారని విమర్శించారు.