ఇల్లు ఖాళీ చేయించారని కోపం..ఓనర్, ఆమె మనవరాలు దారుణ హత్య
X
ఇళ్లు ఖాళీ చేయించారనే కోపంతో ఇంటి ఓనర్‌తో పాటు, ఆమె మనవరాలిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఐదు గంటల్లోనే కేసు చేధించారు.
పార్వతమ్మ అనే వృద్ధురాలు నందిగామ గ్రామంలో అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తూ ఉంది. ఎవరూ లేకపోవడంతో చెల్లె కొడుకు అయిన కృష్ణయ్య కూతురు భానుప్రియను ఇంట్లో పడుకోవడానికి పిలుచుకుంది. ఆమె ఇంట్లో బిహార్ కు చెందిన సాహు దంపతులు అద్దెకు ఉంటున్నారు. గత మే నెలలో వారు ఇంటిలో దిగారు. అయితే భార్యభర్తలు ఎప్పుడూ గొడవలు పడుతుండడంతో పార్వతమ్మ వారిని ఇంటి నుంచి ఖాళీ చేయించింది. దీంతో అదే ఏరియాలో ఇళ్లు తీసుకున్న వారు..ఇంటిని ఖాళీ చేయించిన పార్వతమ్మపై పగ పెంచుకున్నారు. ఆమె ఇంట్లో ఎవరూ ఉండరని తెలిసిన సాహు..గురువారం రాత్రి వెళ్లి పార్వతమ్మ, ఆమె మనవరాలిని హత్య చేశాడు. అనంతరం బీరువాలో ఉన్న బంగారంతో ఉడాయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. నాలుగు బృందాలుగా జల్లెడ పట్టి సాహు తంపతులను అరెస్ట్ చేశారు.