Home > జాతీయం > రెండో పెళ్లని తెలిసి గుండు గీయించబోయారు.. అసలు ట్విస్ట్ వేరే ఉంది

రెండో పెళ్లని తెలిసి గుండు గీయించబోయారు.. అసలు ట్విస్ట్ వేరే ఉంది

రెండో పెళ్లని తెలిసి గుండు గీయించబోయారు.. అసలు ట్విస్ట్ వేరే ఉంది
X

బీహార్‌లోని గయాలో జరిగిన ఓ పెళ్లి కొడుకుపై దాడి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక్బాల్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి... మొదటి భార్య జీవించి ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ధోబీ పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి కుటుంబ సభ్యులకు తన మొదటి పెళ్లి విషయం దాచి, మాయామాటలు చెప్పి.. ఎలాగోలా పెళ్లి పీటల వరకూ తీసుకొచ్చాడు. అయితే లాస్ట్ మినిట్ లో అతనికి ఇంతకుముందే పెళ్లైందన్న విషయం తెలిసి.. యువతి కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. అన్యాయంగా తమ కూతురిని బలిచేయబోయామని.. ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. సెహ్రా ధరించి పెళ్లికి సిద్ధంగా కూర్చున్న ఆ వ్యక్తిని ఓ కొంతమంది వ్యక్తులు దాడి చేస్తున్నట్లు ఆ వీడియోలో వైరల్ అవుతోంది. పెళ్లికి వచ్చిన ఇతర బంధువులు, గ్రామ ప్రజలు అతణ్ని పట్టుకొని పిచ్చికొట్టుడు కొట్టారు. తప్పైందని పెళ్లికొడుకు చేతులు జోడించి పదే పదే క్షమాపణలు చెబుతున్నా.. ఏ ఒక్కరూ ఊరుకోలేదు.





ఇక్కడితో ఈ దాడి అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. రెండో పెళ్లికి రెడి అయ్యావా అంటూ అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ ఊరిలోని మంగలిని పిలిచి గుండుగీయమని పురమాయించారు. అందుకు వద్దు వద్దు అంటూ జుట్టును అదిమి పట్టుకుంటున్న ఆ పెళ్లి కొడుకుని చూసి పరువు కోసం అలా వద్దంటున్నాడేమో అని అనుకున్నారు. కానీ ఆ జనంలో ఒకరు ధైర్యం చూసి ఆ జుట్టును లాగా.. అతని చేతికి పెళ్లి కొడుకు విగ్గు ఊడి వచ్చింది. అప్పటికే వరుడికి మొదటి పెళ్లే కాదు.. బట్టతల కూడా ఉందన్న రహస్యం బట్టబయలైంది. ఇక కోపంగా ఉన్న యువతి బంధులు ఇంకాస్త రెచ్చిపోయారు. బట్టతలతో ఉన్న ఆ నడి వయస్కుడికి తమ కూతురు కావాల్సి వచ్చిందా అనుకుంటూ మరోసారి ఉతికి ఆరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై దోభి పోలీస్ స్టేషన్ కానీ.. కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కానీ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.










Updated : 11 July 2023 11:52 AM IST
Tags:    
Next Story
Share it
Top