కులాంతర వివాహం చేసుకున్నదని.. బైక్‌పై చెల్లెలి కిడ్నాప్.. వీడియో వైరల్
X
తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని ఓ మహిళ పట్ల ఆమె అన్న దారుణంగా ప్రవర్తించాడు. కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి.. హఠాత్తుగా ఆమెను స్నేహితుడి సాయంతో బైక్‌పై బలవంతంగా తీసుకెళ్లాడు. మహిళ భర్త తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. చివరకు ఆమె భర్త చెంతకే చేరింది. కలకలం రేపిన ఈ కిడ్నాప్ ఘటన బీహార్‌లోని అరారియా బంథాహా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక శ్యామ్ నగర్ కు చెందిన రూపా కుమారి అనే యువతి.. చోటుకుమార్ అనే వ్యక్తితో చాలా కాలంగా ప్రేమ వ్యవహారంలో ఉంది. చోటు కుమార్ వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆమె కుటుంబ సభ్యులు వారి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో వారు గత నెల (మే )28న పారిపోయి సుపాల్ జిల్లాలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వివాహం చెల్లుబాటు అయ్యేలా కోర్టు ద్వారా ధ్రువపత్రాన్ని కూడా సాధించారు. తమ కూతురు సుపాల్‌లో ఉందన్న విషయం తెలుసుకున్న రూపా కుమారి కుటుంబ సభ్యులు.. అక్కడికి వెళ్లి ఆ దంపతులను తమ ఊరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత తమకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించగా.. తాను చోటుకుమార్‌తోనే ఉంటానని చెప్పి..అతనితో వెళ్లిపోయింది.
జూన్ 3న గ్రామ పెద్దల సమక్షంలో ఈ పెళ్లి గురించి మాట్లాడదామని చోటు కుమార్ కుటుంబాన్ని పంచాయితీకి పిలిచింది యువతి కుటుంబం. సమస్యను పరిష్కరించేందుకు పిలిచి, అక్కడి నుండి స్నేహితుడి సాయంతో బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్ కు పాల్పడ్డాడు. దీంతో సోమవారం చోటు కుమార్ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేశాడు. "పంచాయితీ జరుగుతుండగా, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారు. నా కొడుకు కోసం వెతికారు. నా కొడుకుపై దాడి చేస్తారనే తెలిసే.. పంచాయితీకి అతన్ని తీసుకురాలేదు. నాపై దాడి చేశారు. ఆ గందరగోళంలోనే యువతి సోదరుడు ఆమెను బైక్‌పైకి లాగి, ఆమెను ఒడిలో పెట్టుకుని అక్కడి నుండి పారిపోయాడు" అని చోటు కుమార్ తండ్రి సురేశ్ కుమార్ ఠాకూర్ చెప్పారు.
దీనిపై ఎస్‌డిపిఓ, ఖుస్రు సిరాజ్ మాట్లాడుతూ: "సంఘటన గురించి తెలియగానే, తమ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుందని.. యువతిని ఆమె తల్లిదండ్రుల చెర నుండి విడిపించామని చెప్పారు. రూపాకుమారి కుటుంబ సభ్యులు చోటూ తండ్రిపై భౌతిక దాడికి పాల్పడడంతో.. యువతి తండ్రి, అన్నపై కేసు నమోదు చేశామని చెప్పారు. చోటు కుమార్ తండ్రి వాంగ్మూలంతో FIR నమోదు చేశామన్నారు.
अररिया: लड़की को जबरन बाइक पर उठा ले गए उसके भाई, अंतरजातीय विवाह से थे नाराज
— News24 (@news24tvchannel) June 5, 2023
श्यामनगर गांव का बताया जा रहा वायरल वीडियो, प्राथमिकी दर्ज कर पुलिस कर रही छापेमारी #Bihar #Araria #ViralVideo pic.twitter.com/I5T6DTK6o2