Home > జాతీయం > రామచరిచరిత్ మానస్‌ అలాంటిది.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం..

రామచరిచరిత్ మానస్‌ అలాంటిది.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం..

రామచరిచరిత్ మానస్‌ అలాంటిది.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం..
X

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం తగ్గక ముందే మరో మంత్రి రామకథను లక్ష్యం చేసుకున్నారు. తులసీదాసు రచించిన ‘రామచరితమానస్’ పొటాషియం సైనైడ్ అని బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన 'హిందూ దివస్' కార్యక్రమంలో ఆయన హిందూమత గ్రంథాలపై దుమ్మెత్తి పోశారు.

‘‘55 వంటకాలు తయారు చేసి, అందులో పొటాష్ సైనైడ్ కలిపితే మీరు తింటారా? హిందూమత గ్రంథాల్లోనూ అలాగే జరుగుతోంది. రాం మనోహర్ లోహియా బాబా నాగార్జున్ వంటివారు విమర్శలు చేశారు. రామచరితమానస్‌‌పై నాకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం దీనిపై మాట్లాడారు. దేశంలో దీనస్థితో ఉన్న కులస్తుల జీవితాలు మెరుగుపడితే రిజర్వేషన్ల అవసరం ఉండనే ఉండదు'' అని అన్నారు.

చంద్రశేఖర్ రామచరితమానస్ పై ఇదివరకు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్, మనుస్మృతి, గోల్వార్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ వంటి హిందూ గ్రంథాలు విద్వేషాన్ని రెచ్చగొట్టి జనం మధ్య చిచ్చుపెడతాయని అన్నారు. దళితులను, బీసీలను, మహిళలను చదువులకు దూరం చేయాలని రామచరితమానస్ చెబుతోందని అన్నారు. చంద్రశేఖర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయనకు హిందూ ధర్మంపై వ్యతిరేక అభిప్రాయాలు ఉంటే మతం మార్చుకోవాలని బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ సూచించారు. హిందువుల మనోభావాలను గాయపర్చిన చంద్రశేఖర్‌ను కేబినెట్ నుంచి తప్పించాలని లోక్‌ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. మంత్రికి పిచ్చిపట్టిందని, తాము నిర్వహిస్తున్న పిచ్చాస్పత్రిలో చేర్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి అన్నారు.


Updated : 16 Sept 2023 8:37 AM IST
Tags:    
Next Story
Share it
Top