Home > జాతీయం > రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భార్య, ప్రియుడు.. కుళ్లబొడిచి, పెళ్లిచేసి..

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భార్య, ప్రియుడు.. కుళ్లబొడిచి, పెళ్లిచేసి..

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భార్య, ప్రియుడు.. కుళ్లబొడిచి, పెళ్లిచేసి..
X

అక్రమ సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొన్ని చోట్ల అనూహ్యంగా సుఖాంతం కూడా అవుతున్నాయి. తప్పు చేసిన భార్యలను భర్తలు సముద్రమంత విశాలమైన పెద్ద మనసుతో క్షమించి, ప్రియుళ్లకు కట్టబెట్టి, ‘‘ఇలాంటి పెళ్లాం నాకొద్దురా బాబూ. బుద్ధి తక్కువై పెళ్లాను. ఈమెకు నువ్వే తగినవాడివి. నువ్వే ఏలుకుని తగలడు’’ అని మనసారా దీవిస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా బిహార్‌లోని నవాడా జిల్లాలలో జరిగింది.

చక్కగా కాపురం చేసుకుంటున్న భార్యకు కొన్నాళ్ల కిందట ఊరికే చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అతనికి పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. ఇటీవల ఓ రాత్రి ఆమె ఇంటికొచ్చి సన్నిహితంగా ఉండగా ఆమె కుటుంబ సభ్యులు కనిపెట్టారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చావ చితగ్గొట్టారు. అతనికి ముఖం ఉబ్బిపోయింది. ఊరి పరువు తీశారని, ఊరి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇంతలో వేరే గ్రామానికి వెళ్లిన భర్త ఇంటికొచ్చి విషయం కనుక్కుని తలపట్టుకున్నాడు. భార్యమీద ప్రేమతో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను, ప్రియుడిని శివాలయానికి తీసుకెళ్లి పెళ్లి చేయించాడు. భార్య దుఃఖంతో విలపిస్తూ నుదురు కొట్టుకుంటుంటే ప్రియుడు దిక్కతోచక నొసట సిందూరం పూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Updated : 7 July 2023 8:05 PM IST
Tags:    
Next Story
Share it
Top