సీఎంపైకి దూసుకొచ్చిన బైక్.. పుట్ పాత్పైకి దూకిన నితీష్
X
బీహార్ సీఎం నితీష్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఓ బైక్ ఆయన వైపు వేగంగా దూసుకొచ్చింది. ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకుని బైక్ దూసుకరావడం కలకలం రేపుతోంది. దీంతో వెంటనే సీఎం ఫుట్ పాత్ పైకి దూకడంతో ప్రమాదం తప్పింది. నీతీశ్ వాకింగ్ చేసేందుకు తన ఇంటి నుంచి సర్క్యులర్ రోడ్డుకు వెళ్లేటప్పుడు ఈ ఘటన జరిగింది.
సీఎం భద్రతలో భారీ వైఫల్యాన్ని ఈ ఘటన స్పష్టం చెబుతోంది. ఇక బైక్పై వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది పొరబాటున జరిగిందా లేదా దీని వెనుక ఇంకేదైనా ఉద్దేశం ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.త్వరలో పాట్నా వేదికగా పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఘటన అనంతరం ఎస్‌ఎస్‌జీ కమాండెంట్, పట్నా ఎస్‌ఎస్పీని నీతీశ్ తన ఇంటికి పిలిపించుకుని సమావేశమయ్యారు. ఘటన జరిగిన సర్క్యులర్ రోడ్డులో మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు రాజకీయ ప్రముఖలు నివాసాలున్నాయి.