Home > జాతీయం > తీవ్రరూపం దాల్చిన బిపోర్ జాయ్.. ముంబైకు భారీ వర్ష సూచన

తీవ్రరూపం దాల్చిన బిపోర్ జాయ్.. ముంబైకు భారీ వర్ష సూచన

తీవ్రరూపం దాల్చిన బిపోర్ జాయ్.. ముంబైకు భారీ వర్ష సూచన
X

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌జాయ్‌’ తుఫాను మరో 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతుందని చెప్పింది. బిపోర్ జాయ్ ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కి.మీ దూరంలో, ముంబయికి పశ్చిమ - నైరుతి దిశలో 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు చెప్పారు. ముంబైపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు.

తుఫాను ప్రభావంతో కర్నాటక, గోవా, మహరాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పింది. తుఫాను కారణంగా భారీగా అలలు ఎగిసిపడతాయని మత్స్యకారులెవరూ సముద్రంలో వెళ్లొద్దని స్పష్టం చేశారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తుఫాను కారణంగా శని, ఆది, సోమవారాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 65 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు

Updated : 10 Jun 2023 11:17 AM IST
Tags:    
Next Story
Share it
Top