స్వీట్ సర్ప్రైజ్.. ఆకాశంలో చిన్నారి బర్త్ డే సెలబ్రేషన్స్..
X
ఓ చిన్నారి ఆకాశంలో బర్త్ డే జరుపుకుంది. విమానంలో ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ఫస్ట్ బర్త్ డే రోజున తమ విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారికి ఇండిగో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సర్ప్రైజ్కు చిన్నారి కుటుంబం ఎంతో సంతోషించింది. ఈ వీడియోను పాప తండ్రి ఇన్స్టాలో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది.
బ్యూలా లాల్ అనే చిన్నారి తన కుటుంబంతో కలిసి ఇండిగో విమానం ఎక్కింది. అయితే ఆ పాపది ఫస్ట్ బర్త్ డే అని తెలసుకున్న విమానం సిబ్బంది సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. కెప్టెన్ మైక్ అందుకుని.. ‘‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్.. దయచేసి వినండి. నేను మీ కెప్టెన్ అగస్టీన్. ఇప్పుడు అది ముఖ్యం కాదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ మనతోపాటు ఓ పాప ప్రయాణిస్తోంది. ఆమె ఫస్ట్ బర్త్ డే ఇవాళ. మనం అందరం ఈ వేడుకలను విమానంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం’’ అని అనౌన్స్ చేశాడు.
కెప్టెన్ ప్రకటనతో విమానంలోని ప్రయాణికులంతా పాపకు విషెస్ తెలిపారు. ఆ తర్వాత కొచ్చి ఎయిర్పోర్టులో కేక్ కట్ చేశారు. ఈ సర్ప్రైజ్కు పాప తల్లిదండ్రులు హ్యాపీ ఫీలయ్యారు. ఇండిగో సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియోను పాప తండ్రి షేర్ చేయగా.. తక్కువ టైంలోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి వచ్చాయి. ఇది అద్భుతం..మీరు ఈ వీడియోలో ఆ అనంద క్షణాలను పంచుకోవడం చాలా బాగుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.