Home > జాతీయం > ఇదెక్కడి విడ్డూరం..తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు

ఇదెక్కడి విడ్డూరం..తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు

ఇదెక్కడి విడ్డూరం..తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు
X

ఎక్కడైనా సరే టాలెంట్, సర్టిఫికేట్లు, ఎక్సపీరియెన్స్ చూసే ఉద్యోగం ఇస్తారు. కానీ బెంగళూరులో మాత్రం ఓ వింతైన సంఘటన జరిగింది. యువతి తెల్లగా ఉందనే కారణంతో ఉద్యోగాన్ని ఇవ్వలేదట సదరు యాజమాన్యం. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఇప్పుడిదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ విషయం నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. తెల్లగా ఉంటే తప్పేంటంటా అటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.





బెంగళూరులోని ఓ కంపెనీ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన చూసి 'ప్రతీక్ష జిక్కర్' అనే యువతి ఆ జాబ్‎కు అప్లికేషన్ పెట్టుకుంది. కంపెనీ పెట్టిన అన్ని టెస్టుల్లోనూ పాస్ అయ్యింది. మొదటి రెండు రైండ్లలోనూ తన టాలెంట్ తో నెట్టుకువచ్చింది ప్రతీక్ష జిక్కర్. మూడో రౌండును దిగ్విజయంగా ఆమె పూర్తి చేసింది. అన్ని టెస్టులు , రైండ్లు పాస్ అయినా చివరికి కంపెనీ మాత్రం ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు. తెల్లగా ఉండటం వల్లే తనకు జాబ్ ఇవ్వడం లేదని అని సంస్థ తెలిపిందట. కంపెనీ పంపిన మెయిల్ ను చూసే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. మెయిల్‎లో "మీ ప్రొఫైల్ చూశాము. జాబ్‎కి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి. కానీ ఈ జాబ్ మీకు ఇవ్వలేము. ఎందుకంటే మీరు మొత్తం టీమ్ లో ఉన్నవారికంటే తెల్లగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని రిజెక్టు చేస్తున్నాము" అని తెలిపింది. దీంతో షాక్ అయిన ప్రతీక్ష జిక్కర్ ఈ విషయాన్ని లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది.





" కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. మనిషి రంగును బట్టి కూడా జాబ్ ఇస్తారా? ఇలాంటిది నేను అస్సలు ఊహించలేదు. మనిషి రంగును చూసి కాదు దయచేసి వారి టాలెంట్ చూసి ఉద్యోగం ఇవ్వండి" అంటూ ప్రతీక్ష కంపెనీకి రిప్లై ఇచ్చింది. ప్రతీక్ష షేర్ చేసిన ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.





https://in.linkedin.com/in/pratikshajichkar?trk=public_post_embed_feed-actor-name&original_referer=https%3A%2F%2Fwww.linkedin.com%2F

Updated : 28 July 2023 1:30 PM IST
Tags:    
Next Story
Share it
Top