BJP : ఆయన అతి పెద్ద అవినీతిపరుడు.. కేజ్రీవాల్పై బీజేపీ ఫైర్..
X
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందన్న ఆయన ఆరోపణలపై ఫైర్ అయింది. లిక్కర్ స్కాంలో ఈడీ విచారణను ఎదుర్కోలేక కేజ్రీవాల్ ప్రతిసారి తప్పించుకుంటున్నారని, దీన్నిబట్టి చూస్తే ఆయన పెద్ద అవినీతిపరుడని ప్రజలకు అర్థమవుతోందని విమర్శించింది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించిన కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కానీ కేజ్రీవాల్ మాత్రం వాటిని తీసుకునేందుకు నిరాకరించారు.
కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా విమర్శించారు. ఎక్సైజ్, మెడికల్, ఎడ్యుకేషన్ ఇలా ఆప్ ప్రభుత్వం దోచుకోని విభాగమంటూ లేదని ఆరోపించారు. కేజ్రీవాల్ కు రాజ్యాంగంపై విశ్వాసం లేదన్న పూనావాలా.. దర్యాప్తు సంస్థల కన్నా తాను ఉన్నతమైన వ్యక్తినని ఆయన భావిస్తుంటారని విమర్శించారు.
ఇదిలా ఉంటే బీజేపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు ఇవ్వాలంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. అయితే ఆ నోటీసులు తీసుకునేందుకు ఇరువురు నేతలు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల వాదనను ఢిల్లీ సీఎంఓ ఖండించింది. నోటీసు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నా పోలీసులు వాటిని ఇవ్వకుండానే వెళ్లిపోయారని చెప్పింది.