Satyanarayana : బీజేపీకి షాక్.. పోటీ నుంచి తప్పుకున్న ముదిరాజ్ అభ్యర్థి
X
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాక్ల మీద షాక్లు తగుతున్నాయి. ఒకవైపు సీనియర్ నాయకులు, ఆశావహులు, అసంతృప్తులు పార్టీ వీడి వెళ్తుంటే.. మరోవైపు టికెట్ఇచ్చిన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థి ఊరడి సత్యనారాయణ ముదిరాజ్ పోటీ నుంచి తప్పుకున్నాడు. బీసీ నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తున్న బీజేపీ.. ముదిరాజ్ వర్గం కింద సత్యనారాయణకు మొదటి జాబితాలోనే టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచే ప్రచారం కూడా ప్రారంభించారు.
అంతలోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. గత ఐదు రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు లేఖలో చెప్పుకొచ్చారు. ఆ కారణంగా విశ్రాంతి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆరోగ్యం క్షీణించి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని డాక్టర్లు సూచించారు. దాంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సత్యనారాయణ ప్రకటించారు. దీంతో బీజేపీ అధిష్టానం సందిగ్ధంలో పడింది. ఆ టికెట్ ఎవరికి కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.