Home > జాతీయం > మహిళల కోసం వైన్ షాపులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం

మహిళల కోసం వైన్ షాపులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం

మహిళల కోసం వైన్ షాపులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
X

పంజాబ్ లో ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ ను ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్ మాన్‌కు మద్యంపై ఉన్న ప్రేమ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని బీజేపీ పంజాబ్‌ యూనిట్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ జనార్దన్‌ శర్మ ఎద్దేవా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం మహిళలకు స్నేహపూర్వక మద్యం దుకాణాలు నిర్ణయంతో కుటుంబాల్లో చిచ్చు పెట్టిందని ఆయన విరుచుకుపడ్డారు.





“జలంధర్‌లోని లంబా పిండ్ చౌక్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఇక్కడ స్కాచ్, విస్కీ, వైన్, బీర్‌ల అన్ని బ్రాండ్‌లను విక్రయించే ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ స్టూడియో ప్రారంభించారు. పవిత్ర నగరం అమృత్‌సర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ విస్తరించడానికి ఎక్కువ కాలం పట్టదు”అని ఆయన అన్నారు.





గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్ యువతను మాదకద్రవ్యాల అగాథం నుంచి గట్టెక్కిస్తామని ఆప్ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిందని, అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మహిళలను మద్యం వైపు ఆకర్షించేందుకు మద్యం దుకాణాలను తెరవడం ప్రారంభించింది.“బలంగా వేళ్లూనుకుపోయిన ఈ వ్యసనం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లను అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు, మహిళల కోసం మద్యం షాపులను తెరవాలని ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పంజాబీల జీవితాలతో చెలగాటం ఆడుతుంది” అని ఆయన అన్నారు.




Updated : 11 Aug 2023 9:39 AM IST
Tags:    
Next Story
Share it
Top