Lok Sabha Elections : నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..ఎంపీ అభ్యర్థుల ప్రకటన!
X
లోక్‌సభ ఎన్నికలు సమర్పిస్తుడడంతో అధికార బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్బంగా పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం పిలుపుతో హాస్తినకు బండి సంజయ్ వెళ్లారు. ఆయనతో పాటు పలువురు ఆశావాహులు కూడా ఢిల్లీకి క్యూ కట్టారు. పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు వందకుపైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశాహహుల్లో కొంత టెన్షన్ నెలకొంది.
ఇటు తెలంగాణలోనూ మెజార్టీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో పలుమార్లు సమావేశమైంది. అయితే తొలిజాబితాలో తెలంగాణ నుంచి 6, 7 స్థానాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎన్నికల ఫెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని బీజేపీ అనుకుంటుంది. మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో ఈ ప్లాన్ సఫలమవడంతో అదే ఇక్కడ కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ బీజేపీలో చేరనున్నారు. అయితే ఆయనకు బీజేపీ నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం.