Home > జాతీయం > కమలం కొత్త వ్యూహం.. ఉత్తర తెలంగాణపైనే గురి

కమలం కొత్త వ్యూహం.. ఉత్తర తెలంగాణపైనే గురి

కమలం కొత్త వ్యూహం.. ఉత్తర తెలంగాణపైనే గురి
X

కొన్ని నెలల క్రితం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే మాటలు వినిపించేవి. తర్వాత పరిణామాలు మారిపోయి బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయింది. ప్రస్తుతం కొన్ని స్థానాల్లో డిపాజిట్లు దక్కుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇప్పుడు ఆ పార్టీ తన ఆశలన్నీ ఉత్తర తెలంగాణపైనే పెట్టుకుంది. రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలోనే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగారు ప్రధాని మోదీ ఈనెల 25 నుంచి 27 వరకు రాష్ట్రంలో మూడు రోజుల టూర్ ను ఏర్పాటుచేశారు. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలతో పాటు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకోవాలని భావిస్తుంది.

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 కార్పొరేటర్లను గెలుచుకుంది. అదే సమయంలో 4 ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. అవి ఒకటి గ్రేటర్ పరిధిలో ఉండగా.. మూడు ఉత్తర తెలంగాణలో గెలుచుకుంది. ఇప్పుడు అదే ఆ పార్టీకి ఎన్నికల్లో సానుకూలంగా మారే అంశం అయింది. అందుకే కమలం పార్టీ ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ ప్రాంతం నుంచి కనీసం 20 సీట్లు గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు నడుస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ హంగ్ కు ఏ మాత్రం అవకాశం ఉన్నా బీజేపీ కీలకం కావాలని చూస్తుంది.

తెలంగాణలో 20 సీట్లు గెలవండి. ప్రభుత్వం ఏర్పాటులో మనమే కీలకం అవుదామని కేంద్ర మంత్రి అమిత్ షా అనడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకే ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. తాజాగా బీసీ ఆత్మగౌరవ సభ, అణగారిన వర్గాల విశ్వరూప మహాసభను ఏర్పాటుచేశారు. ఇప్పుడు మూడు రోజుల పర్యటన ఖరారు చేసుకున్నారు. నిర్మల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో రోడ్ షోలు ఏర్పాటుచేయనున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.


Updated : 15 Nov 2023 11:01 AM IST
Tags:    
Next Story
Share it
Top