Home > జాతీయం > 7 కీలక హామీలతో బీజేపీ మేనిఫెస్టో.. రేపు రిలీజ్ చేయనున్న అమిత్ షా..

7 కీలక హామీలతో బీజేపీ మేనిఫెస్టో.. రేపు రిలీజ్ చేయనున్న అమిత్ షా..

7 కీలక హామీలతో బీజేపీ మేనిఫెస్టో.. రేపు రిలీజ్ చేయనున్న అమిత్ షా..
X

తెలంగాణ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ మరింత యాక్టివ్ అయింది. ప్రచారంలో జోరు పెంచడంతో పాటు ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో సిద్ధం చేసింది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన మేనిఫెస్టోకు ఇంద్రధనస్సు అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హామీలు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ధీటుగా 7 కీలక అంశాలపై బీజేపీ హామీలను మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం. హామీల అమలుకు ప్రధాని మోడీనే గ్యారెంటీ ట్యాగ్లైన్తో రూపొందించిన ఎన్నికల ప్రణాళికను హోం మంత్రి అమిత్ షా శనివారం రిలీజ్ చేయనున్నారు.

మేనిఫెస్టోలో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, రైతులపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. ఉద్యోగ, ఉపాధి కల్పన అంశాన్ని పొందుపొరిచినట్లు తెలుస్తోంది. పేదలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అదనంగా కొత్త అంశాలను చేర్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రతి వ్యక్తికి బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు స్థానిక సెంటిమెంట్‌ను వాడుకునేలా నగరాల పేర్ల మార్పు అంశాన్ని సైతం మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం.

వరికి కనీస మద్దతు ధర రూ.3,100కు పెంచడం, ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతామని బీజేపీ హామీ ఇవ్వనుంది. ఇక పెళ్లైన ప్రతి మహిళకు ఏటా రూ.12 వేలతో పాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్​పీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌, ఐఐటీ, ఎయిమ్స్​ తరహాలో విద్యా సంస్థల ఏర్పాటు, పీఎం ఆవాస్‌ యోజన కింద అర్హులకు ఇళ్ల తదితర అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం.




Updated : 17 Nov 2023 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top