Home > జాతీయం > Parliament : ఇవాళ పార్లమెంట్కు తప్పక రావాలి.. ఎంపీలకు బీజేపీ విప్ జారీ

Parliament : ఇవాళ పార్లమెంట్కు తప్పక రావాలి.. ఎంపీలకు బీజేపీ విప్ జారీ

Parliament  : ఇవాళ పార్లమెంట్కు తప్పక రావాలి.. ఎంపీలకు బీజేపీ విప్ జారీ
X

ఇవాళ్టితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ సభలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలంతా ఉభయ సభలకు హాజరుకావాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఇవాళ ఉభయసభల్లో పలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరై ప్రభుత్వానికి మద్ధతు తెలపాలని విప్లో పార్టీ స్పష్టం చేసింది.





మోదీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. మరో రెండు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అదే విధంగా 2014 ముందు.. ఆ తర్వాత జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంలో యూపీఏ పాలనను ఎండగట్టారు. ఇక ఇవాళ లోక్ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఇవాళ్టితో సమావేశాలు ముగుస్తుండడంతో సాయంత్రం ఆయన ప్రసంగించనున్నారు. గత 10 ఏళ్ల అనుభవంపై కీలక ప్రసంగం చేస్తారని సమాచారం. మొన్న రాజ్యసభలో మాట్లాడిన మోదీ గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు.


Updated : 10 Feb 2024 3:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top