Home > జాతీయం > ఆ లీకుల వెనుక కేసీఆర్ హస్తం.. అన్నీ అవాస్తవాలే - జితేందర్ రెడ్డి

ఆ లీకుల వెనుక కేసీఆర్ హస్తం.. అన్నీ అవాస్తవాలే - జితేందర్ రెడ్డి

ఆ లీకుల వెనుక కేసీఆర్ హస్తం.. అన్నీ అవాస్తవాలే - జితేందర్ రెడ్డి
X

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పార్టీలు దూకుడు పెంచాయి. ఇక బీజేపీలో ఈటల రాజేందర్ - బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో పాటు ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తారనే వార్తలు షికారు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పు లీకుల వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు. రాత్రికి రాత్రే అధ్యక్షుడిని మార్చడం తమ పార్టీలో ఉండదన్నారు. బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులు లేవని స్పష్టం చేశారు. అవన్నీ కేసీఆర్ కుట్రలని.. వాటిని కార్యకర్తలు పట్టించుకోవద్దని చెప్పారు.

‘‘ఈ మధ్య సీరియల్‌గా కేసీఆర్ కొన్ని లీకులను పంపించడంతో పార్టీ నాయత్వంలో, కార్యకర్తల్లో అయోమయం ఉంది. అందుకే పలువురు నేతలం సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించాం. తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు. కేసీఆర్‌ కుట్రలను పట్టించుకోవద్దని పార్టీ కేడర్‌కు చెబుతున్నాం. కాంగ్రెస్‌ పార్టీతో బీఆర్‌ఎస్‌ పొత్తుపెట్టుకోవడం ఖాయం.. ఎన్నికల తర్వాత ఆ రెండూ కలిసిపోతాయి’’ అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Updated : 11 Jun 2023 7:19 PM IST
Tags:    
Next Story
Share it
Top